AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా?

మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా?

Phani CH
|

Updated on: Jun 30, 2026 | 1:37 PM

Share

ప్రతి నెల జీతం వచ్చినా డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? పెద్ద ఖర్చులు లేకపోయినా చిన్న చిన్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు, ఆటో డెబిట్ చెల్లింపులే జీతాన్ని నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నాయని ఓ వైరల్ రెడ్డిట్ పోస్ట్ వెల్లడించింది. 'ఇన్విజిబుల్ స్పెండింగ్'గా పిలిచే ఈ ధోరణిపై నిపుణులు ఆర్థిక క్రమశిక్షణ, సబ్‌స్క్రిప్షన్ల సమీక్ష తప్పనిసరి అంటున్నారు.

ఉద్యోగాలు చేసే సగటు మధ్య తరగతి వాళ్లకు ప్రతీ నెల వచ్చే జీతమే ఆధారం. ఆ వచ్చే డబ్బుతోనే అన్నీ ఖర్చులు వెళ్లదీసుకొని.. కట్టాల్సిన అప్పులు, ఈఎంఐలు చెల్లించి మిగిలితే పొదుపు చేసుకోవాలి. కాని ప్రస్తుతం ఆ జమానా మారిపోయింది. జీతం వచ్చిన ఒకటి రెండ్రోజులకే వచ్చిన డబ్బంతా ఆవిరైపోతోంది. నాల్గో రోజు లేదంటే ఐదో రోజు నుండి మళ్లీ కొత్తగా అప్పులు ఎవరిస్తారా అనే పరిస్థితి చాలా మందికి అనుభవమే. మరి జీతం ఏమైపోతోంది..? ప్రతినెలా జీతం ఎటు పోతోందో అర్థం కావడం లేదని చాలా మంది భావిస్తారు. ఖరీదైన గ్యాడ్జెట్లు కొనలేదు, లగ్జరీ షాపింగ్‌లు చేయలేదు, అయినా డబ్బులు మాయమవుతున్నాయి అంటూ హర్షిత్ శర్మ అనే యువ ఉద్యోగి రెడ్డిట్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ‘ఇన్విజిబుల్ స్పెండింగ్’ లేదా ‘యాప్ ట్రాప్’ అనే కొత్త చర్చకు దారితీసింది. హర్షిత్ తన బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను జాగ్రత్తగా చెక్ చేయడంతో అసలు విషయం తెలిసిపోయింది. అతని జీతాన్ని దొంగిలిస్తున్నది ఒక్క పెద్ద ఖర్చు కాదు, అనేక చిన్న చిన్న నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు. స్విగ్గీ వన్, జొమాటో గోల్డ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, స్పాటిఫై.. ఇలా ప్రతి యాప్ కోసం చెల్లించే మొత్తం చిన్నదే. ‘కేవలం రూ.99’, ‘రూ.149 మాత్రమే’, ‘స్టూడెంట్ ఆఫర్’ అంటూ ఆకర్షణీయంగా కనిపించే ఈ చెల్లింపులన్నీ కలిపి నెల చివరికి పెద్ద మొత్తంగా మారుతున్నాయని అతను గ్రహించాడు. తాను డబ్బు కడుతున్న వాటిలో సగం యాప్స్‌ను కనీసం నెలలో ఒకటి, రెండుసార్లు కూడా తెరవలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం హర్షిత్ శర్మ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. కంటికి కనిపించకుండా చిన్న చిన్న అవసరాల కోసం చేసే ఖర్చును గుర్తుంచుకోలేని వాళ్లు ఈవిధంగా ఆటో డెబిట్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ధోరణిని ‘మైక్రో-స్పెండింగ్ ఫెటీగ్’ అంటారు. సౌలభ్యం కోసం రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌లు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఆర్థిక అవగాహన, క్రమశిక్షణ ఇప్పుడు మరింత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!

అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!

క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!

“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!

ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు

Follow Us