Viral Video: వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Sep 02, 2024 | 12:26 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని నడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయి. ఇక జంతువులకు సంబంధించి ఫన్నీ వీడియోలు కూడా తరచూ వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని నడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయి. ఇక జంతువులకు సంబంధించి ఫన్నీ వీడియోలు కూడా తరచూ వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో తేలికపాటి జల్లులు కురుస్తుండగా, ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతూ.. పక్కనే ఉన్న తల్లి ఏనుగు చుట్టూ తిరుగుతూ అమ్మను కూడా తనతో ఆడాలని కోరుతుంది.. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోలేదు. ఇంతలో బాల్ నీటి గుంటలోకి వెళ్లి పడింది. అయినా ఆగలేదు..ఆ గున్న ఏనుగు.. నీటి గుంటలోకి దిగి మరీ మరి ఎంజాయ్ చేస్తూ ఆడింది. ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..