సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం నుండి పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం సారలమ్మ ప్రతిరూపాన్ని గద్దెలపైకి తీసుకువస్తారు. జంపన్న వాగు గుండా సాగే ఈ యాత్రకు పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనం తోడైంది. లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రమై, తొలి ఘట్టానికి సిద్ధమైంది.
మేడారం మహా జాతర జన సంద్రంగా మారింది. కోట్లాది భక్తులు ఎదురుచూస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం కన్నె పల్లిలోని సారలమ్మ దేవాలయం నుండి సారలమ్మ ప్రతిరూపాన్ని పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గద్దెల పైకి తీసుకువస్తారు. ప్రధాన పూజారి సారయ్య ఆధ్వర్యంలో ఆరుగురు పూజారులు ఈ క్రతువును నిర్వహిస్తారు. సారలమ్మ ప్రతిరూపాన్ని జంపన్న వాగు గుండా తీసుకువచ్చే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అదే సమయంలో పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలు కూడా గద్దెల పైకి చేరుకుంటాయి. పోలీసులు, కుల పెద్దల బందోబస్తు మధ్య సాయంత్రం 6 గంటలకు సారలమ్మ బయలుదేరి, రాత్రి 11 గంటల సమయానికి గద్దెలపైకి చేరుకుంటుంది. మేడారం పరిసర ప్రాంతాలన్నీ సుమారు 30 లక్షల మందికి పైగా భక్తులతో నిండిపోయాయి. ప్రకృతిని దైవంగా కొలిచే ఈ అద్భుత ఘట్టం మేడారం జాతరకు తొలి రోజు ప్రత్యేకతను తెచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :