Rain Alert: రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.తర తమిళనాడు తీరం, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురిశాయి. ఇక బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వివరించింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 5న కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల కింద, కరెంట్ స్తంబాల వద్ద నిల్చోవద్దని అధికారులు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలియా ఫెయిలైతే.. కియారా క్లిక్ అయ్యారా ??
కళకళలాడుతున్న షూటింగ్ స్పాట్‌లు.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా
థింక్ గ్లోబల్ అంటున్న జక్కన్న.. మహేష్ కోసం ఏం ప్లాన్ చేశారు
