వానాకాలానికి.. నో ఎండ్‌ వచ్చే రెండ్రోజులూ వానలే

Updated on: Oct 10, 2025 | 4:53 PM

తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలే పరిస్థితి కనిపించటం లేదు. ఒకవైపు చలికాలం సీజన్ మొదలయ్యే రోజులు వస్తున్నా.. వరుణుడు కదలిపోవటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు రాజకీయం సెగలు కక్కుతుంటే.. మరోవైపు వాతావరణం మాత్రం చాలా కూల్‌గా ఉంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలుజిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఈ క్రమంలో వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు భారీ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. దక్షిణ ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా సముద్ర మట్టం నుంచి 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీ విషయానికొస్తే.. ద్రోణి ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు

షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..

Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే

Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్‌ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్‌

SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్‌- ప్రియాంక చోప్రాపై ఫోక్‌ సాంగ్‌