Watch: దుబ్బాకలో సొమ్మసిల్లి పడిపోయిన సీతవ్వ.. యూరియా కోసం పొద్దుగాలనే వచ్చి..
తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సహకార సంఘాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న కస్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో యూరియా కస్టాలు పీక్స్‌లో ఉన్నాయి. దుబ్బాకతోపాటు.. ఎక్కడ చూసినా యూరియా ఇబ్బందులే కనిపిస్తున్నాయి.
తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సహకార సంఘాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. రెండు నెలలుగా కొనసాగుతున్న కస్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో యూరియా కస్టాలు పీక్స్‌లో ఉన్నాయి. దుబ్బాకతోపాటు.. ఎక్కడ చూసినా యూరియా ఇబ్బందులే కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం క్యూలైన్ లో వేచిఉన్న గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన సీతవ్వ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో అక్కడున్నవారు ఆమెకు సపర్యలు చేశారు.
ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం, కాట్రియాల గ్రామాలలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా లారీలు రావడంతో టోకెన్ల కోసం ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్ లో నిలబడ్డారు రైతులు. కాట్రియాల రైతు వేదిక, ప్రగతి ధర్మారం పంచాయతీ కార్యాలయం వద్ద టోకెన్లు పంపిణీ చేశారు అధికారులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
