యూరియా వచ్చేస్తోంది.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Updated on: Aug 29, 2025 | 3:26 PM

తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న రైతులు.. యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియాపై ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయంటూ తెలిపారు. రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి 21,325 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా అవుతుందన్నారు.

తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న రైతులు.. యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియాపై ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయంటూ తెలిపారు. రెండ్రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి 21,325 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా అవుతుందన్నారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో మరో 29,700 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందన్నారు. డిమాండ్‌ మేరకు ఆయా జిల్లాలకు యూరియా తరలించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల.. ఈ సాయంత్రంలోగా పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బృందాలుగా పర్యటించి పంటనష్టం వివరాలు సేకరించాలని సూచించారు.