కృష్ణవేణి అలలపై సోమశిల-శ్రీశైలం లాంచి ప్రయాణం
పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అలలపై లాహిరి లాహిరి లాహిరిలో అంటూ లాంచిలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహా ఎంతో థ్రిల్లింగ్ ఉంది కదా.! నిజంగా ఆ అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్. తెలంగాణ మాల్దీవులుగా చెప్పుకునే సోమశిల నుంచి శ్రీశైలం వరకు గలగల పారే కృష్ణమ్మ ఓ వైపు.. పచ్చని చీర కట్టుకున్న నల్లమల అడవి అందాలు మరోవైపు..
ఇలా అందాల మధ్య ఎంతో ఆహ్లాదంగా సాగే ఆ జర్నీలో ఎన్నెన్నో విశేషాలున్నాయి. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణం ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా వచ్చే చల్లని పిల్లగాలులు. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిలరావాలు. ఇలా కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. ఎక్కువ మంది పర్యాటకులు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. ఒక్కరోజులోనే టూర్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు అధికారులు. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో పర్యాటకులు మదురానుభూతి చెందుతున్నారు. ఈ ప్రయాణంలో చారిత్రక ప్రదేశాలు, కొండలు, జలపాతాలు కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోనసీమకు-కెనడాకి వియ్యం కుదిరింది !! తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి
బిస్కెట్ల సాయంతో ఉగ్రవాదిని లేపేశారు
Regina Cassandra: బాలీవుడ్‌లో మీటింగ్స్ అంటే ఏంటి ?? రెజీనా కామెంట్స్ వైరల్
ఆ ప్రశ్న అడిగినందుకు.. విలేకరి ఫోన్ విసిరేసిన స్టార్ కమెడియన్
ఈ రకమైన చేపలు.. క్యాన్సర్ రోగులకు వరమట