Hyderabad: ఇంట్లోకి దూరి గడియ పెట్టాడు.. ఆ గృహిణి ఎవరు నువ్వు అని అడగ్గా..
నిజంగా ఇలాంటి ఘటన జరిగితే ముందు బిత్తరపోతారు. కానీ ఆ గృహిణి ధైర్యంగా గుర్తు తెలియని వ్యక్తికి చెక్ పెట్టింది. ఎవడో దుండగుడు.. మద్యం సేవించాడో.. మతిస్థిమితం లేదో తెలియదు. అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి.. రెండో ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి డోర్ పెట్టి.. అక్కడ కూర్చున్నాడు. ఎవరు.. ఏంటి అంటే పిచ్చి సమాధానాలు చెప్పాడు.
హైదరాబాద్ నిజాంపేటలో గల బాచుపల్లిలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశారు. అనుమానాస్పద వ్యక్తి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి గడియపెట్టాడు. భయాందోళనకు గురైన ఆ ఇంట్లోని గృహిణి.. ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావ్ అంటూ ప్రశ్నించింది. తనను ఎవరో చంపడానికి వచ్చారు అని.. అందుకే వచ్చానని.. అరవొద్దు అంటూ సదరు వ్యక్తి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఆ గృహిణి ధైర్యంగానే ప్రశ్నిస్తూ.. అతడిని వీడియో తీసింది. ఇంట్లో నుంచి బయటకు రమ్మంటూ గద్దించింది. ఇంతలో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్ వాసులు కూడా వస్తుండంటంతో.. బయటకు ఆ వచ్చిన ఆ దుండగుడు.. అపార్ట్‌మెంట్ రెండో ఫ్లోర్ నుంచి దూకి.. పారిపోయాడు. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు స్ధానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Mar 04, 2024 04:37 PM