వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్‌ కానున్నాయా !! మళ్లీ ఏమైంది

Updated on: Oct 08, 2025 | 4:15 PM

తెలంగాణలో మరోసారి ప్రయివేటు కాలేజీలు బంద్ జరగనుందా? ప్రభుత్వం ఫీజ్‌ రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలల మళ్లీ సమ్మె బాట పట్టేలా ఉన్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బకాయిలు చెల్లించటం లేదని కాలేజీ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 12లోపు బకాయిలు చెల్లించకుంటే 13 నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.

సీఎంవో కార్యాలయంతో తప్ప మరెవరితో చర్చించబోమని, అవసరం అయితే విద్యార్థులతో కలిసి ఛలో హైదరాబాద్‌ చేపడతామని సంఘ నేతలు హెచ్చరించారు. ప్రైవేటు కాలేజీలకు చెల్లించాల్సిన 1200 కోట్ల బకాయిలకు కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. అదేమని అడిగితే దీపావళిలోగా ఇస్తామంటున్నారని.. కానీ.. ఎలా ఇస్తారో చెప్పమంటే మాత్రం సమాధానం లేదన్నారు. ఈ క్రమంలోనే.. ఈ నెల 12లోగా వెయ్యి కోట్లు చెల్లించాలని.. మిగిలిన బకాయిల చెల్లింపుపై గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌తో ప్రైవేట్‌ కాలేజీలు గత నెల 15 నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే.. బంద్‌కు ఒకరోజు ముందు.. కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపి బకాయిల విడుదలకు హామీ ఇచ్చారు. దసరాలోపు 600 కోట్లు, దీపావళి తర్వాత మరో 600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించాయి. కానీ.. రెండు వారాలు పూర్తయినా హామీ నెరవేర్చకపోవడంతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి బంద్‌ సహా భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే

వెయ్యి కోట్ల వసూళ్ల రేసులో ఇండియన్ సినిమా

అంతకు మించి అనేలా ఉండబోతున్న AA 22.. హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్..

Baahubali: బాహుబలి టీంలో రీ రిలీజ్ జోష్.. క్రేజ్ మామూలుగా లేదుగా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు.. మరో బ్లాక్ బస్టర్ పక్కా