ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే.. జూన్‌లోనే ప్రారంభం!
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతిరోజూ ఉదయం ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. జూన్ 12న ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
దేశంలోనే తొలిసారిగా పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ చదివే వారికి కూడా ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను కూడా చేర్చడం విశేషం. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.92 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 120 కోట్లను ఖర్చు చేయనుంది. విద్యార్థులకు అవసరమైన సరైన పోషకాలు అందేలా అధికారులు ప్రత్యేక బ్రేక్ ఫాస్ట్ మెనూను రూపొందించారు. రోజుకో రకం వంటకం ఉండేలా ప్లాన్ చేశారు. అల్పాహారంలో భాగంగా.. బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా అందించనున్నారు. ఈ ఫలహారాల్లోకి రుచికరమైన చట్నీ, సాంబార్, మరియు మిక్స్డ్ వెజిటెబుల్ కుర్మా వంటివి కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బలవర్ధక ఆహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, వారు చదువుపై మరింత శ్రద్ధ పెట్టేందుకు దోహదపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం
బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!
‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..