నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. ఐదుగురు రైతులు సురక్షితం

Updated on: Aug 28, 2025 | 3:58 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా రక్షించారు 24 గంటలపాటు సాయం కోసం ఎదురుచూసిన రైతులను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురిని హెలికాఫ్టర్‌ సాయంతో కాపాడారు NDRF సిబ్బది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా రక్షించారు 24 గంటలపాటు సాయం కోసం ఎదురుచూసిన రైతులను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురిని హెలికాఫ్టర్‌ సాయంతో కాపాడారు NDRF సిబ్బది. దీంతో సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.. అధికారులు, నేతలంతా సమన్వయంతో పని చేస్తున్నామన్న బండి సంజయ్‌.. వర్షాలు, వరదలపై ప్రభుత్వం ఎప్పటిప్పుడు సమీక్షలు చేపట్టాలన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిని సన్మానించారు.

వర్షాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు బండి సంజయ్. హెలికాప్టర్‌ కోసం మంత్రులు మమ్మల్ని సంప్రదించారని, నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లను సహాయక చర్యల్లో వినియోగించలేకపోయామన్నారు. ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో వరదల్లో చిక్కుకున్న రైతులను కాపాడగలిగామన్నారు బండి సంజయ్ .