అమెజాన్, కార్ల్స్‌బర్గ్ కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం వీడియో

Updated on: Sep 19, 2025 | 2:45 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఢిల్లీ పర్యటనలో అమెజాన్, గూగుల్, కార్లెయిల్, గోల్డ్‌మన్ సాచ్స్, ఉబర్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ భేటీలు కీలకమైనవని తెలుస్తోంది. న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ ముర్ఫీతో కూడా ఆయన సమావేశమయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌తో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరిపారు. ఉదయం న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ ముర్ఫీతో సమావేశమైన రేవంత్ రెడ్డి, మధ్యాహ్నం అమెజాన్, గూగుల్, కార్లెయిల్, గోల్డ్‌మన్ సాచ్స్, ఉబర్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా చర్చించారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం అధ్యక్షులతో కూడా ఆయన భేటీ అయ్యారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో ప్రసంగించడంతో పాటు, విజన్ తెలంగాణ రైజింగ్ చర్చలోనూ పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో ఈ పర్యటన జరుగుతోందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

రాజీనామాను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు వీడియో

విమానంలో టీ కోసం గొడవ చెట్టంత మగాడిని చావబాదిన మహిళ వీడియో

సీనియర్ నటి రమాప్రభ అల్లుడు .. తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ ఎక్కువే వీడియో

సార్‌.. అమ్మ చదువుకోమంటోంది.. తల్లిపై ఫిర్యాదు చేసిన బాలుడు వీడియో