ORRకు ఆనుకుని ఉన్న 27 లోకల్‌ బాడీలు GHMCలో విలీనం

Updated on: Nov 25, 2025 | 10:34 PM

తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో జీహెచ్‌ఎంసీ విస్తరణకు కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఉన్న 27 లోకల్ బాడీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ఆమోదించింది. దీంతో పాటు మూడో డిస్కం ఏర్పాటు, రామగుండం థర్మల్, పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు కూడా అనుమతులు లభించాయి.

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా సాగి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల, చుట్టూ ఉన్న 27 లోకల్ బాడీలు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియపై సమగ్ర నివేదిక అందించాలని కౌన్సిల్‌ను ఆదేశించారు. విద్యుత్ రంగానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు వెలువడ్డాయి. మూడో డిస్కం (విద్యుత్ పంపిణీ సంస్థ) ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వన్డే సిరీస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

చైనా ఓవరాక్షన్‌.. భారత మహిళపై వేధింపులు

PM Modi: ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్న ప్రధాని మోదీ

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌పై ప్రభావం.. పలు విమానాలు రద్దు

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే