Telangana Assembly: మూసీ ప్రాజెక్టుపై దుమ్ముదుమారం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం

Updated on: Mar 18, 2026 | 10:39 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ అన్నట్లు నడిచింది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. సభా సమరం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ అన్నట్లు నడుస్తోంది. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ పలు పశ్నలు సంధించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా.. మొదటి దశ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7 వేల కోట్లు అని శ్రీధర్‌ బాబు ప్రకటించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. 1438 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో వేలాది మంది నష్టపోతున్నారని పేర్కొన్నారు. మెయిన్ హార్ట్ అనే కంపెనీకి DPR తయారీ కాంట్రాక్ట్ ఇచ్చారు..DPR తయారీకే 18 నెలలు పడుతుందని గతంలో ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు.

గన్‌పార్క్‌ దగ్గర BRS ఎమ్మెల్యేల నిరసన

అంతకుముందు గన్‌పార్క్‌ దగ్గర BRS ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వ ధోరణిపై ఆందోళన చేపట్టారు. మొక్కజొన్నకు రూ.2400 మద్దతుధర, రూ.500 బోనస్‌ ఇవ్వాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని హరీష్‌ రావు డిమాండ్ చేశారు

Follow Us