3 రోజుల్లో 3 వేల నుంచి 3.5 లక్షలకు !! దూసుకెళ్తున్న అరట్టై యాప్‌

Updated on: Oct 13, 2025 | 5:41 PM

స్వదేశీ ప్లాట్‌ఫాం జోహో తీసుకొచ్చిన మెసేజింగ్ యాప్‌ ‘అరట్టై’ డౌన్‌లోడ్స్‌లో దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రోజువారీ సైన్అప్స్‌ 3 వేల నుంచి 3.5 లక్షలకు పెరిగాయి. జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. కొందరు దీన్ని ‘వాట్సప్‌ కిల్లర్‌’ అంటున్నారు. ఈ యాప్‌ గురించి 5 ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అరట్టై అంటే తమిళంలో మాట్లాడుకోవడం.

ఈ యాప్‌ను జోహో కార్పొరేషన్‌ 2021లోనే లాంచ్‌ చేసింది. ప్రస్తుతం దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. వన్‌-టు-వన్‌, గ్రూప్‌ చాట్స్‌, వాయిస్‌ నోట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. తాజాగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఈ యాప్‌ను ప్రోత్సహిస్తూ ప్రజలు వాడాలని పిలుపునివ్వడంతో డౌన్‌లోడ్లు పెరిగాయి. దీంతో అరట్టై ఆండ్రాయిడ్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో నెట్‌వర్కింగ్‌ విభాగంలో నంబర్‌-1 స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ యాప్‌పై చర్చలు మరింత పెరిగాయి. భారత్‌లో వాట్సప్‌ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. ఫ్యామిలీ చాట్స్‌, ఆఫీస్‌ వర్క్‌, బిజినెస్‌ ట్రాన్సాక్షన్స్‌ అన్నింటిలోనూ భాగమైపోయింది. దీంతో అరట్టైకి ఇది పెద్ద సవాలనే చెప్పాలి. రెండింటిలోనూ ప్రధాన తేడా ఏంటంటే.. ప్రస్తుతం అరట్టైలో కాల్స్‌ ఎన్‌క్రిప్టెడ్‌ అయినా, చాట్స్‌ మాత్రం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ కావు. వాట్సాప్‌కు ఇది ఒక అడ్వాంటేజ్‌ అనే చెప్పొచ్చు. అయితే జోహో తన ప్రైవసీ ప్రామిస్‌ని త్వరగా అమలుచేస్తూ, తన మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటే ఇది వాట్సాప్‌కి గట్టి పోటీ ఇవ్వగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాటకు.. మాట !! టాలీవుడ్‌లో కొత్త కాంట్రవర్సీ

కాంతారకు రూ.కోట్లలో కలెక్షన్స్‌ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

మొన్న విజయ్..నేడు రష్మిక..ఎంగేజ్మెంట్‌ రింగ్స్‌తో లవ్ బర్డ్స్

ప్రధాని మోదీకి రామ్ చరణ్‌.. స్పెషల్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్

NTRపై బాలీవుడ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు !! బుద్ది చెప్పాల్సిందే