Face Recognition ATM: ఐరిస్ స్కాన్ ఉంటేనే ఏటీఎం నుంచి డబ్బులు..! బ్యాంకింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ..

|

Jan 23, 2023 | 9:13 AM

ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ జపం చేస్తోంది. దాదాపు అన్ని దేశాలు వివిధ రంగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీతో కూడిన ఎన్నో సదుపాయాలు


ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ జపం చేస్తోంది. దాదాపు అన్ని దేశాలు వివిధ రంగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీతో కూడిన ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఏ చిన్న పనికి కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం సాంకేతికత కారణంగా ఎన్నో సదుపాయాలు ఇంట్లోనే ఉండి మొబైల్‌ ద్వారా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఇక దేశంలో డబ్బుల విత్‌డ్రా కోసం ఏటీఎం విషయంలో కూడా పలు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో సరికొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో ‘కళ్లు’ చూపించి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే సదుపాయం రాబోతోంది. ఇది ఐరిస్‌ స్కార్‌ ద్వారా సులభతరం అవుతుంది. బ్యాంకులు త్వరలో కొన్ని లావాదేవీలలో ఐరిస్ స్కాన్ లేదా ఫేస్ రికగ్నిషన్‌ ద్వారా ఖాతాదారుడు డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని దేశంలోని కొన్ని పెద్ద బ్యాంకులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బ్యాంకు మోసం, పన్ను ఎగవేతలను నిరోధించడానికి దేశంలోని బ్యాంకులను ఐరిస్ స్కాన్‌ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే సూచించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 23, 2023 09:13 AM