Whatsapp: ఫోటో కొట్టు.. వీడియో పట్టు.. వాట్సాప్‌లో మరో అమేజింగ్‌ ఫీచర్‌

Updated on: Apr 01, 2025 | 5:20 PM

అలా ఫోటో తీస్తే.. ఇలా వీడియోగా కన్వర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది అంటారా.. యస్.. అలాంటి జింగ్ జింగ్ అమేజింగ్ ఫీచర్.. వాట్సాప్ త్వరలో మీకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం చాలా రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నా దాదాపు అందరూ వాడేది మాత్రం వాట్సాప్. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను యూజ్‌ చేస్తుంటారు.

మెసేజింగ్ రంగంలో నంబర్ వన్ గా ఎదిగింది. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ యూజర్లకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు కృషి చేస్తోంది. మెటా యాజ‌మాన్యంలోని ఈ యాప్‌కు కోట్లాది మంది యూజ‌ర్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజ‌ర్ల ఎక్స్‌పీరియ‌న్స్‌ను మెరుగుప‌రిచేందుకు ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్స్‌ను ప‌రిచ‌యం చేస్తుంది. గోప్యత‌, భ‌ద్రత‌ కోసం.. కంపెనీ.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తీసుకువ‌స్తోంది. వాట్సాప్‌ త్వరలో చాట్స్‌, ఛానెల్స్‌లో మోషన్‌ ఫొటోలనును షేర్‌ చేసేందుకు మరో కొత్త ఫీచర్‌ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు కొన్ని సెకన్ల వీడియో, ఆడియో రికార్డింగ్‌ లతో సహా ఫొటోలను షేర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ కొత్త బీటా వెర్షన్‌లో కనిపించింది. అయితే, ఐఫోన్‌ యూజర్లు మాత్రం ఈ ఫీచర్‌ని లైవ్‌ ఫొటోల రూపంలో చూడొచ్చని వాట్సాప్‌ ట్రాకర్‌ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెల్లవారుజామున వేంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుత ఘటన.. నెట్టింట వీడియో వైరల్‌

కనిపించడు కానీ, ఆటగాడే..! లవ్‌లో పడ్డ సిరాజ్‌ ??

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. సీన్ కట్ చేస్తే.. భర్త ఏం చేసాడంటే ?

రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..

పరగడుపున.. ఈ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో