Whatsapp: బీ అలర్ట్‌.. భయపెడుతున్న వాట్సాప్‌ హ్యాక్‌ స్కామ్‌

Updated on: Jan 08, 2026 | 12:34 PM

వాట్సాప్‌లో 'ఘోస్ట్ పెయిరింగ్' స్కామ్ ప్రబలంగా ఉంది. తెలిసిన వారి నుండి ఫోటో/వీడియో లింక్‌లు వచ్చినా జాగ్రత్త. వాటిని క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మోసాలు చేయగలరు. మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయండి, లింక్డ్ డివైజెస్‌ను తరచుగా తనిఖీ చేయండి, అనుమానాస్పద లింకులను నివారించండి.

వాట్సాప్‌లో ‘ఘోస్ట్ పెయిరింగ్’ స్కామ్‌ జరుగుతోంది. వాట్సాప్‌ను హ్యాక్‌ చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అకౌంట్‌ నుంచి ఫొటో లేదా వీడియో పంపిస్తారు. దానిని ఓపెన్ చేయగానే మీ అకౌంట్‌ హ్యాక్‌ అవుతుంది. ఎవరు పంపినా సరే అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయకూడదు. టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆన్‌ చేసి పెట్టుకుని, లింక్డ్‌ డివైజెస్‌ను తరచూ చెక్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ” ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే నకిలీ వాట్సాప్‌ వెబ్‌ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది. ఓటీపీ గానీ, స్కానింగ్ కానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్‌ హ్యాకర్ల డివైస్‌కు కనెక్ట్‌ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసం చేస్తారు. చివరికి మీ వాట్సాప్‌ను మీరే వాడలేకుండా లాక్‌ చేస్తారు. సెట్టింగ్స్‌లో ‘Linked Devices’ ఆప్షన్‌ను చెక్‌ చేయండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి. Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి. ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్‌ మొత్తం హ్యాకర్ల పరమవుతుంది. కాల్ ఫార్వార్డింగ్ ను సెట్టింగ్స్ లోకి వెళ్లి డిసేబుల్ చేయండి. ముఖ్యమైన ఫొటోలు/ ఫైల్స్ బ్యాకప్ చేసుకోండి. తెలియని యాప్స్ ను వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. ఫాక్టరీ రిసెట్ చేసి హైడ్ ఆప్షన్స్ ను తొలగించండి. యాప్స్ ను ప్లే స్టోర్/ యాప్ స్టోర్ నుంచే ఇన్ స్టాల్ చేయండి. వాట్సాప్ ను మళ్లీ ఇ న్ స్టాల్ చేసి, మీ నెంబర్ తో వెరిఫై చేయండి. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను ఎప్పుడూ ఇన్ స్టాల్ చేయకండి. మీ అకౌంట్‌ నుంచి డబ్బు పోయినట్లయితే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. ఆ దేశం అయితే వణికిపోయేదాన్ని

వేగంగా దూసుకెళ్తున్న రైలు.. రైలుకు వేళాడుతూ యువకుడు

టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట

Published on: Jan 08, 2026 09:45 AM