వాట్సాప్ కీలక అప్‌డేట్… ఇకపై చాట్ జీపీటీ పని చేయదు
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్‌ను మెటా అప్‌డేట్ చేసింది. ఇక నుంచి చాట్‌జీపీటీని యూజ్ చేయడం అంత ఈజీ కాదు. అంతేకాదు.. పర్‌ప్లెక్సిటీ, లూజియా, పోక్ వంటి థర్డ్‌పార్టీ ఏఐ చాట్‌బాట్‌లు వాట్సాప్‌లో పనిచేయవు. ఈ కొత్త విధానం జనవరి 15, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలో తన సొంత "మెటా AI" అసిస్టెంట్‌ను విడుదల చేయనుంది.
మెటా తన ప్లాట్‌ఫామ్‌లలో AI ఫీచర్‌లను క్రమంగా అనుసంధానిస్తోంది. వినియోగదారులకు వాటిని నిలిపివేయడానికి ఎంపికను అందించకుండా చేస్తోంది.మీ సర్వీస్ ప్రధానంగా AI ఆధారంగా పని చేసేదైతే మీరు వాట్సాప్ బిజినెస్ సొల్యూషన్‌ను ఉపయోగించలేరు. బ్యాంకులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, హెల్త్‌కేర్ ప్రొవైడర్లు, ట్రావెల్ కంపెనీలు వంటి కస్టమర్ సర్వీస్ కోసం AIని ఉపయోగించే వ్యాపారాలకు ఈ నియమం వర్తించదని మెటా స్పష్టం చేసింది. వాట్సాప్‌లో ప్రజాదరణ పొందిన స్వతంత్ర AI చాట్‌బాట్ ప్రొవైడర్ల సంఖ్యను ఈ చర్య ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత వారు ప్లాట్‌ఫారమ్‌లో తమ సేవలను నిలిపివేయవలసి వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాబోయేది మినరల్ వార్.. రంగంలోకి భారత్.. చైనాకు చెక్
గత అమావాస్యకు క్షుద్రపూజలు.. ఈ అమావాస్యకు షాపు దగ్ధం
