రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన దళపతి వీడియో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన సినీ ప్రయాణం నుండి రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. మలేషియాలో జరిగిన ఓ ఈవెంట్‌లో జననాయగన్ తన చివరి చిత్రమని స్పష్టం చేశారు. 30 ఏళ్ల సినీ జీవితంలో అభిమానుల ప్రేమకు ప్రతిఫలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దళపతి వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి.
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన రిటైర్‌మెంట్‌పై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి మలేషియాలో జరిగిన ఒక మ్యూజిక్ ఈవెంట్‌లో అధికారికంగా తెరదించారు. పొలిటికల్ ఎంట్రీతో సినిమాలు మానేస్తారని వార్తలు ఉన్నప్పటికీ, అభిమానులు ఆయన మనసు మార్చుకుంటారని ఆశించారు. అయితే, విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
