వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్‌ పాడ్స్‌

|

Aug 29, 2023 | 8:00 PM

సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్‌లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్‌ పాడ్స్‌లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చట గిరాఫెనాప్‌ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్‌ పాడ్స్‌ను రూపొందించారు.

సాధారణంగా పడుకుని నిద్రపోవడమే మనకు అలవాటు. కొంతమంది బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆఫీసుల్లోనూ కూర్చుని కూడా కునుకు తీస్తుంటారు. జపాన్‌లోని హొక్కాయిడో నగరానికి చెందిన కొయోజు ప్లైవుడ్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ రూపొందించిన ఈ స్లీపింగ్‌ పాడ్స్‌లో నిలువునా నిలబడి కూడా కునుకు తీయవచ్చట గిరాఫెనాప్‌ పేరుతో 8.4 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఈ స్లీపింగ్‌ పాడ్స్‌ను రూపొందించారు. ఇది చూడటానికి పాతకాలం టెలిఫోన్‌ బూత్‌లా ఉన్నా.. ఇందులో చాలా సౌకర్యాలే ఉన్నాయట. ఇందులో కూర్చుని, డెస్క్‌పై పనిచేసుకోవచ్చు. నిలబడి నిద్రపోవాలి అనుకుంటే ఇందులోని ఒక బటన్ నొక్కితే చాలు– కూర్చీ నిట్టనిలువున పైకి లేస్తుంది. ఇందులో తలవాల్చుకునేందుకు దిండు కూడా ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??

Follow us on