పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్‌ ఏంటంటే!

Updated on: Dec 01, 2025 | 9:04 PM

సిమ్ కార్డుల దుర్వినియోగం, IMEI మార్పుపై డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికాం (DoT) కీలక హెచ్చరికలు జారీ చేసింది. మీ పేరు మీదున్న సిమ్ కార్డుతో జరిగే సైబర్ నేరాలకు మీరే బాధ్యులవుతారు. IMEI మార్పు చేస్తే 3 సంవత్సరాల జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నకిలీ పత్రాలతో సిమ్ తీసుకోవడం, ఇతరులకు ఇవ్వడం నేరం. మీ సిమ్ కార్డు, మొబైల్ వాడకంలో జాగ్రత్త వహించండి.

ఆఫర్లు ఉన్నాయి కదా! అని కొంత మంది సిమ్‌కార్డులు ఎడాపెడా కొనేసి వ్యాలిడిటీ అయిపోగానే మూలన పడేస్తుంటారు. మరికొందరు వాడటం లేదన్న ఉద్దేశంతో తెలిసిన వ్యక్తులే కదా అని ‘వాడుకో’ అని ఇచ్చేస్తుంటారు. అయితే, మీరు వదిలేసిన సిమ్ కార్డు నంబర్‌ సైబర్‌ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకో వాడినట్లు తేలితే అందుకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ సిమ్‌ నంబర్ నుంచి వెళ్లే ప్రతి కాల్‌కి కార్డు యజమానిగా మీరూ బాధ్యులే! అని గుర్తుంచుకోండి. సిమ్‌కార్డు దుర్వినియోగంపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం DoT) ముఖ్య ప్రకటన చేసింది. సిమ్‌ కార్డుల కొనుగోలు, వాడకం విషయంలో అలర్ట్‌గా ఉండాలి. ట్యాంపర్‌ చేసిన IMEI మొబైల్‌ డివైస్‌లను వాడకుండా దూరంగా ఉండాలని హెచ్చరించింది. IMEI ట్యాంపర్‌ చేసిన మోడెమ్‌, మాడ్యూల్స్‌, సిమ్‌ బాక్సులను కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా నేరమని డాట్‌ (DoT) తెలిపింది. అదే విధంగా నకిలీ పత్రాలు సమర్పించి సిమ్‌ కార్డులను కొనడం, మీ పేరిట తీసుకున్న సిమ్‌కార్డులను మరొకరికి ఇవ్వడం కూడా నేరం. సైబర్‌ నేరాలకు మీ సిమ్‌కార్డు ఉపయోగించినట్లు తేలితే మీరు తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం. నేరానికి పాల్పడినవారితో పాటు ఆ సిమ్‌కార్డు యజమాని కూడా బాధ్యుడే. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) లేదా ఇతర టెలికాం గుర్తింపులను మార్చగలిగే మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్లను ఉపయోగించొద్దని పేర్కొంది. 2023 టెలికమ్యూనికేషన్స్‌ చట్టం ప్రకారం సెల్‌ఫోన్లతో పాటు ఇతర డివైజుల్లో IMEIని (ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ) ట్యాంపర్‌ చేస్తున్నట్లు డాట్ గుర్తించింది. అలాంటి చర్యలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటాయని డాట్‌ తెలిపింది. 2024 టెలికమ్యూనికేషన్స్‌ రూల్స్‌ ప్రకారం ఐఎంఈఐ మార్పు చేసిన డివైజ్​ వినియోగం నిషిద్ధం. సంచార్‌ సాథి మొబైల్‌ యాప్‌లో ఐఎంఈఐ వివరాలను తనిఖీ చేసుకోవాలని సూచించింది. IMEI వివరాలు ఎంటర్‌ చేస్తే బ్రాండ్‌ నేమ్‌, మోడల్‌, తయారీ వివరాలు దర్శమిస్తాయని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 100 కోట్ల లగ్జరీ ఇంటిని వీడిన కోటీశ్వరుడు..! ఎందుకంటే

అరుదైన ఈ పువ్వును మీరు ఎప్పుడూ చూసి ఉండరు!

వాష్‌రూమ్‌లో నుంచి భారీ శబ్ధం.. వెళ్లి చూస్తే..అమ్మబాబోయ్‌..

ట్రూ-కాలర్ కాదు.. అంతకు మించి.. ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాకే

వీరికి సీతాఫలం విషంతో సమానం.. హెచ్చరిస్తున్న వైద్యులు