వాట్సాప్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇక కాల్స్‌ షెడ్యూలింగ్ సాధ్యమే

Updated on: Aug 19, 2025 | 7:02 PM

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కాలింగ్ ఫీచర్ కోసం బిగ్ అప్‌డేట్‌‌తో వచ్చేసింది. ఇకపై.. కోరుకున్న టైంలో వాట్సప్ కాల్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే.. గ్రూప్ కాల్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. కాల్ ప్రారంభానికి ముందుగానే గ్రూపు సభ్యులందరికీ అలర్ట్ వెళుతుంది.

మీ వాట్సాప్ గ్రూప్ కాల్స్‌ను ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరు లేదా మొత్తం గ్రూప్‌ను ఇన్వైట్ చేయొచ్చు. ముందుగానే వారందరికీ నోటిఫికేషన్ వెళుతుంది. వాట్సాప్‌లో కాల్ షెడ్యూల్ చేయొచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. వాట్సాప్ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్‌కి వెళ్లండి. కాల్ ఐకాన్‌పై ట్యాప్ చేయండి. కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఎంచుకోండి. షెడ్యూల్ కాల్ ఆప్షన్ ఎంచుకోండి. డేట్, టైమ్ సెట్ చేయండి. వీడియో కాల్ లేదా ఆడియో కాల్ ఏది కావాలో ఎంచుకోండి. గ్రీన్ బటన్‌ను ట్యాప్ చేయండి. ఇప్పుడు, మీ వాట్సాప్ షెడ్యూల్ కాల్ రాబోయే కాల్స్ లిస్టులో కనిపిస్తుంది. ముందుగా వాట్సాప్ కాల్స్ జాయిన్ అయ్యే వారందరికీ రిమైండర్‌ను పంపుతుంది. ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ ను కూడా మెటా కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త ఇన్-కాల్ టూల్స్ ఎమోజీలతో అవతలి వారిని డిస్టర్బ్ చేయకుండా కూడా కనెక్ట్ అవ్వొచ్చు. అలాగే కాల్స్ ట్యాబ్ ఫీచర్‌ ఇప్పుడు షెడ్యూల్ కాల్‌ లో ఎవరు జాయిన్ అవుతారో చూపిస్తుంది. ఇన్వైట్ లింక్‌లను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎవరైనా లింక్ ద్వారా చేరినప్పుడు కాల్ క్రియేటర్లు కూడా అలర్ట్స్ పొందుతారు. వాట్సాప్ అన్ని కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ అప్‌డేట్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా

హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు

రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్