ఇక.. ఇండియాలో ఇంద్రధనస్సు కనబడదా? వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు
అప్పుడప్పుడూ వర్షం పడిన తర్వాత ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సును చూస్తే ఎవరికైనా మనసు పులకరిస్తుంది. అందుకే ఆ హరివిల్లును చిన్నారుల మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు. రంగురంగుల ఆ ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల విరిజల్లును కురిపిస్తుంది. చల్లని వాతావరణంలో.. ఆకాశం వైపు చూస్తూ.. ఆ ఇంద్రధనస్సులోని రంగులను చూసినప్పడు.. ప్రకృతి అందం ముందు ఏదీ పోటీ పడలేదని అనిపిస్తుంది.
ఆ ప్రత్యేకమైన అనుభూతిని మాటల్లో చెప్పటం కష్టమే. అయితే.. మనందరం చూసి ఆనందించే ఆ అందాల ఇంద్రధనస్సు ఇకపై మనదేశంలో కనిపించకపోచ్చన్ననే చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి నిర్ధారించింది. కాలుష్యం, వాతావరణ మార్పులు కారణంగా హరివిల్లు అంతర్థానమయ్యే అవకాశాలు పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది. ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా ‘గ్లోబల్ ఎన్‌వైరెన్మెంటల్ ఛేంజ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మేఘాల్లోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది. ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివిల్లు అంతర్థానమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల్లోనూ ఇంద్రధనస్సు మాయమయ్యే అవకాశాలున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి 117 రోజులపాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా 2100 ఏడాదికల్లా మరో 4 నుంచి 4.9 శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచానావేశారు. అయితే కొన్ని చోట్ల అత్యధికంగా, కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయని, అలా అతి తక్కువగా ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉందని వారు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌నే బెదిరిస్తావా.. ట్రంప్ ?? పుతిన్
Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అఘోరాలు.. గొరిల్లా..
Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం
చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ
రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక
