స్మార్ట్‌ఫోన్‌ను తలదన్నే డివైస్‌.. పాకెట్‌లో ఇమిడిపోయే ‘ర్యాబిట్‌ ఆర్‌1’

|

Jan 13, 2024 | 9:14 PM

కృత్రిమ మేథ తో పనిచేసే అధునాతన డివైజ్‌లు స్మార్ట్‌ఫోన్‌లకు కాలం చెల్లేలా చేస్తున్నాయి. అమెరికా స్టార్టప్‌ కంపెనీ ర్యాబిట్‌ అనే కొత్త ఏఐ డివైజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘ర్యాబిట్‌ ఆర్‌1’గా పిలుస్తున్న ఈ డివైజ్‌ ఎంచక్కా పాకెట్‌లో ఇమిడిపోతుంది. విడుదల రోజే ఈ డివైజ్‌ను 10 వేల మంది బుకింగ్‌ చేసుకొన్నారంటే దీని క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే.. ఏదైనా ఆహారం ఆర్డర్‌ ఇవ్వాలంటే ఫుడ్‌ యాప్స్‌ ఫోన్‌లో ఉండాలి.

కృత్రిమ మేథ తో పనిచేసే అధునాతన డివైజ్‌లు స్మార్ట్‌ఫోన్‌లకు కాలం చెల్లేలా చేస్తున్నాయి. అమెరికా స్టార్టప్‌ కంపెనీ ర్యాబిట్‌ అనే కొత్త ఏఐ డివైజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘ర్యాబిట్‌ ఆర్‌1’గా పిలుస్తున్న ఈ డివైజ్‌ ఎంచక్కా పాకెట్‌లో ఇమిడిపోతుంది. విడుదల రోజే ఈ డివైజ్‌ను 10 వేల మంది బుకింగ్‌ చేసుకొన్నారంటే దీని క్రేజ్‌ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదెలా పనిచేస్తుందంటే.. ఏదైనా ఆహారం ఆర్డర్‌ ఇవ్వాలంటే ఫుడ్‌ యాప్స్‌ ఫోన్‌లో ఉండాలి. ఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్‌ బుకింగ్స్‌కి యాప్‌ తప్పనిసరి. ఇవేమీ అవసరం లేకుండా వాయిస్‌ అసిస్టెంట్‌తో అవసరమేంటో చెప్పగానే.. అడిగిన సేవలు క్షణాల్లో లభిస్తుంది. ర్యాబిట్‌ ప్రత్యేక ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది డివైస్‌. ఫోన్‌లో ఉన్నట్టే డిస్‌ప్లే స్క్రీన్‌, కెమెరా, మైక్రోఫోన్‌ దీంట్లో ఉన్నాయి. ఈ డివైజ్‌లో ఒక్కటేమిటీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువే ఫీచర్లు ఉన్నాయి. యాప్స్‌ అవసరం లేదు. లోకల్‌ ల్యాంగ్వేజ్‌లో కమాండ్స్‌ ఇస్తే సరిపోతుంది. అవసరమైన పనులను ఈ డివైజ్‌ చేసిపెడుతుంది. దీని ధర 199 డాలర్లుగా అంటే రూ. 16 వేలగా నిర్ణయించారు. ఈ డివైజ్‌ సహాయంతో ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను మనం ఉన్నచోట నుంచే కంట్రోల్‌ కూడా చేయొచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘అటల్‌ సేతు’ పై సముద్రంలో 16 కి.మీ. ప్రయాణం

విమానంలో నిలిచిపోయిన‌ ఆక్సిజ‌న్.. ఫుట్‌బాల్‌ జట్టుకు తప్పిన ప్రమాదం

భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ

మీకు గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??

కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సందడిగా వేడుకలు