చీకటిలోనూ చూసేలా చేసే ఐ డ్రాప్స్‌! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

Updated on: May 31, 2025 | 11:02 AM

పగటిపూట మన కంటితో ఏదైనా సరే క్లియర్‌గా చూడగలం. రాత్రిపూట లైట్ల వెలుతురులోనో, వెన్నెల రాత్రిలోనో చూడగలం. కానీ కరెంట్, వెన్నెల వంటివి లేని చిమ్మచికటిలో ఎవరైనా చూడగలరా? అసాధ్యమనే అందరూ అంటారు. కానీ ఇక ముందు సాధ్యం కావచ్చు అంటున్నారు కాలిఫోర్నియాకు చెందిన సైన్స్ ఫర్ ది మాసెస్అనే స్వతంత్ర పరిశోధక బృందం నిపుణులు.

ఎందుకంటే వీరు చీకటిలో సైతం చూడగలిగే ఐడ్రాప్స్‌ను తయారు చేశారు. చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన బయోహాకర్స్ టీమ్, అలాగే సైన్స్ ఫర్ ది మాసెస్‌ బృందం నిపుణులు ఈ ఘనత సాధించారు. చిమ్మ చీకటిలోనూ చూడగలిగే ఐడ్రాప్స్‌ను వారు డెవలప్ చేశారు. చీకటిని ఛేదించే కంటి చుక్కలను డెవలప్ చేయడం కోసం పరిశోధకులు క్లోరిన్ e6 అనే సమ్మేళనాన్ని ఉపయోగించారు. వాస్తవానికి ఇది లోతైన సముద్రాల్లోని చేపలలో, వాటి కంటిచూపునకు దోహదపడే ఒక రసాయనం. దీని కారణంగా అవి చీకటిలోనూ నీటిలో తిరుగుతూ అన్నీ చూడగలవు. అయితే ఈ సమ్మేళనాన్ని ఇన్సులిన్, అలాగే సెలైన్‌తో కలిసి కంటిలో వేయడం వల్ల.. తాత్కాలికంగా రాత్రిపూట సైతం చూపు మెరుగవుతుంది. అలాంటి ఒక ద్రావణాన్ని పరిశోధకులు తయారుచేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలాలను వదిలి.. చెంగు చెంగున ఎగురుతూ చెరువుల్లోకి చేపలు

కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా

కలెక్టర్‌ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ

పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్

పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు