చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు

|

Jun 19, 2024 | 11:28 PM

ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్‌ మందుల వాడకం ఎక్కువైపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందులు వేసేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు AMRX అని నామకరణం చేశాయి.

ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్‌ మందుల వాడకం ఎక్కువైపోయింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీ బయాటిక్‌ మందులు వేసేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ విద్యా సంస్థ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్‌ బయోనెస్ట్‌లోని సైన్‌ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌కు AMRX అని నామకరణం చేశాయి. ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణుడు, తన ఎదుట ఉన్న రోగికి వచ్చిన జబ్బు, వ్యాధిని ఎలా విశ్లేషిస్తారో అలాగే చేస్తుంది. వైద్యుల మనసు, మెదడు ఎలా తార్కికంగా ఆలోచిస్తాయో అలాగే ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఫలితాలు తక్షణమే వస్తాయి. కాబట్టి అనవసరంగా యాంటీ బయాటిక్‌ ఔషధాల వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా చాలా మంది వైద్యులు రక్త, మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీ బయాటిక్‌ ఔషధాలను వాడిస్తూ… నివేదికలు వచ్చిన తర్వాత అసలు యాంటీ బయాటిక్స్‌ అవసరమా, తగ్గించాలా, పెంచాలా అని నిర్ణయిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్యనిపుణులు వాటిని రాసుకుని… ఆ సమాచారమంతా ఈ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఒక్క చుక్క రక్తం కూడా అవసరం లేకుండా.. క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది. AMRX సాఫ్ట్‌వేర్‌పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పదివేల రోగుల పరిస్థితులను పరిశీలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??

కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??

యాక్టింగ్ సూపర్ క్వీన్.. జైలులో రిమాండ్ మహిళా ఖైదీ హైడ్రామా

బైకును ఢీకొట్టి ఎగిరిపడ్డ ఆటో డ్రైవర్‌.. ఆ తర్వాత..

Follow us on