అమెజాన్‌ బెజోస్‌ రాకెట్‌తో అంగారకుడి పైకి వ్యోమనౌక

Updated on: Nov 18, 2025 | 7:03 PM

నాసా ప్రతిష్ఠాత్మక ఎస్కపేడ్‌ మార్స్‌ మిషన్‌ బ్లూ ఆరిజిన్ న్యూ గ్లెన్ రాకెట్‌తో విజయవంతంగా ప్రారంభమైంది. అంగారకుడు తన వాతావరణాన్ని ఎలా కోల్పోయాడో, దాని నివాసయోగ్యతను పరిశోధించడానికి ఈ మిషన్‌లో 'బ్లూ', 'గోల్డ్' ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ పునర్వినియోగ రాకెట్ ప్రయోగం 2027 నాటికి మార్స్ కక్ష్యను చేరి, కీలక డేటాను సేకరించనుంది.

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా .. మార్స్‌ మిషన్‌ ప్రయోగం సక్సెస్ అయింది. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ సంస్థ బ్లూ ఆరిజిన్‌’కు చెందిన రీ యూసెబుల్ రాకెట్‌ అంతరిక్ష నౌకను నింగిలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రాకెట్‌ విజయవంతంగా భూమిని చేరింది. వాతావరణ సమస్యలు, సౌర తుపాను కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఎస్కపేడ్‌’ మిషన్‌ గురువారం అంగారకుడి వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్లోరిడా తీరంలోని కేప్‌ కెనవెరల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి అతి శక్తివంతమైన రాకెట్‌ అయిన ‘న్యూ గ్లెన్‌’తో అంతరిక్ష నౌక ఆకాశంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో 321 అడుగుల భారీ రాకెట్‌ ‘న్యూ గ్లెన్‌’ కొత్త శకానికి నాంది పలికింది. ‘ఎస్కపేడ్‌’ను నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడానికి కారణం ఈ మిషన్‌లో రెండు ఉప గ్రహాలు ఉండడమే. బ్లూ, గోల్డ్‌ పేర్లున్న ఈ ఉపగ్రహాలు అంగారక గ్రహం ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో పరిశోధింధిస్తాయి. మార్స్‌ పరిణామం, నివాసయోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. అంతేకాకుండా ఈ ఉపగ్రహాలు మార్స్‌ అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణాన్ని శోధించనున్నాయి. బిలియన్ల ఏళ్ల కొద్ది నిగూఢంగా ఉన్న డేటాను ఇవి సేకరించనున్నాయి. ‘ఎస్కపేడ్‌’ అంతరిక్ష వాహక నౌక ఒక ఏడాది పాటు భూకక్షలో తిరుగుతూ 2027 నాటికి అంగారకుడి కక్షలోకి చేరనుంది. ఒకసారి మార్స్‌ కక్షలోకి ప్రవేశించగానే బ్లూ, గోల్డ్‌ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. జెఫ్‌ బెజోస్‌ భార్య లారా సాంచెజ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లి చేసిన అద్బుతం కోమాలో నుంచి కూతురు బయటకు

చుట్టూ ఈదుతున్న చేపలు.. వాటి మధ్య లంచ్‌

30 రోజుల్లో 10 కేజీలు తగ్గి.. స్టేజ్‌ పై కుప్పకూలిన సింగర్‌

దినసరి కూలీకి రూ.35 కోట్ల జీఎస్‌టీ బిల్లు

బంపర్‌ ఆఫర్‌ పిల్లలను కంటే రూ. 30 లక్షలు