చీకటిమయం కాబోతున్న భూమి.. కారణం అదేనంటున్న నాసా

Updated on: Nov 11, 2025 | 3:22 PM

నాసా అధ్యయనం ప్రకారం భూమి తన సహజ ప్రకాశాన్ని కోల్పోతోంది, సూర్యరశ్మిని ఎక్కువగా శోషించుకుంటుంది. భారత్‌లో మూడు దశాబ్దాలుగా ఎండ గంటలు తగ్గుతున్నాయి, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరిశ్రమలు, వాహనాలు, పంట వ్యర్థాల వల్ల ఏర్పడే ఏరోసోల్స్ ఈ సమస్యకు కారణం. యూరోప్ వలె కఠిన కాలుష్య నియంత్రణ చట్టాలు అవసరం.

భూమి నెమ్మదిగా తన సహజ ప్రకాశాన్ని కోల్పోతుందని నాసా తాజా అధ్యయనం తెలిపింది. భూమి గతంలో కన్నా ఎక్కువగా సూర్య కాంతిని శోషించుకుంటోందని తెలిపింది. దీనివల్ల భూమిపై సున్నితమైన వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని హెచ్చరించింది. దక్షిణార్ధ గోళం కన్నా ఉత్తరార్ధ గోళం వేగంగా చీకటిమయం అవుతుందని తెలిపింది. ఇటువంటి అంధకార ఫలితం వల్ల వర్షపాతం, ఉష్ణోగ్రతలు వంటి ప్రపంచ వాతావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఉపగ్రహం ద్వారా సేకరించిన 24 సంవత్సరాల సమాచారాన్ని విశ్లేషించి, ఈ నివేదికను రూపొందించారు. భారత్‌కి ఒక కొత్త సవాలు ఎదురవుతోంది. గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా… ఎండ ఉండే గంటలు క్రమంగా తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలిసింది. ఈ పరిణామం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. శాస్త్రవేత్తలు 1988 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలోని 20 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప మినహాయింపులు ఉన్నప్పటికీ, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏటా సూర్యరశ్మి గంటలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా అమృత్‌సర్, కోల్‌కతా తో పాటు, హిమాలయ ప్రాంతాలు, ముంబైలో ఈ తగ్గుదల అధికంగా ఉంది. గాలిలో తేలియాడే అతి సూక్ష్మ ధూళి కణాలు ఏరోసోల్స్ ఈ సమస్యకు మూల కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ నుంచి.. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణంలోకి చేరే ఈ కణాలు.. సూర్యరశ్మిని నేరుగా భూమిని చేరకుండా అడ్డుకుంటున్నాయి. కాలుష్య నియంత్రణ చట్టాల ద్వారా యూరోప్ ఈ సమస్యను అధిగమించి మళ్లీ సూర్యరశ్మిని పొందగలిగింది. భారత్ కూడా కఠిన చట్టాలతో కాలుష్యాన్ని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు పక్కనే 2వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకున్న స్థానికులు

కొడుకు మృతిని తట్టుకోలేక ప్రాణం విడిచిన తండ్రి..

భారత్‌పై లానినా ఎఫెక్ట్‌.. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్‌

యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు