తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??

Updated on: Oct 18, 2025 | 6:52 PM

మారిన జీవన శైలిలో భాగంగా మొబైల్‌ వాడకం అనేది నిత్యావసరంగా మారింది. మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవంగా మొబైల్‌ తయారైంది. మొబైల్‌ లేనిది పూటగడవని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు మొబైల్‌ ఫోన్‌కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు. ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలాండ్‌లోని వ్రోక్లా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. మొబైల్ పోన్ వాడకం తేనెటీగల వినాశనానికి దారితీస్తున్నట్లు పేర్కొన్నది. ఫోన్ల వాడకంవల్ల రేడియేషన్ వెలువడుతుంది. ఫోన్ల రేడియేషన్‌ వల్ల ఇప్పటికే కొన్ని రకాల పక్షులు కనిపించకుండా పోయాయని జంతు, పక్షి ప్రేమికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్రోక్లా యూనివర్సిటీ రిపోర్టు మరింత ఆందోళన కలిగించే విధంగా ఉంది. 900 MHz రేడియోఫ్రీక్వెన్సీ రేడియేషన్ తేనేటీగలకు, ప్రకృతిలో అతి సూక్ష్మమైన కొన్ని జీవులకు నష్టం చేకూరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. మానవులు కేవలం ఒక గంట మొబైల్ ఫోన్ వాడితేనే.. దాని నుంచి వెలువడే రేడియేషన్ ఫ్రీక్వెన్సీకి గురైన తేనెటీగల్లో తీవ్రమైన పోషకాహార లోపం ఏర్పడుది. అవి శక్తిహీనంగా మారుతున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌ఫోన్లు, సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ఎక్స్‌పోజర్‌వల్ల ప్రపంచ ఆహారంలో మూడింట ఒక వంతు పంటలను పరాగ సంపర్కం చేసే తేనెటీగలు సెల్యులార్ స్థాయిలో ఆకలి సమస్యకు గురవుతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో తేనెటీగల జనాభాను నాశనం చేయడం ద్వారా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతిగా స్మార్ట్‌ఫోన్ చూస్తే.. అంతే సంగతులు

అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేసారని అనస్తీషియా ఇచ్చి భార్యను కడతేర్చాడు

1638 కార్డులతో జల్సా.. కట్ చేస్తే గిన్నిస్ రికార్డు.. కారణం అదే

K- Ramp: కే ర్యాంప్‌ సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం.. అబ్బా అనిపించాడా ?? తెలియాలంటే వీడియో చూసేయండి

పిల్లలకు పేర్లు పెడుతూ కోట్ల సంపాదన.. ఒక్కో పేరుకు రూ. 27 లక్షలు