India Space Station : అంతరిక్షంలో భారత్ స్పేస్‌ స్టేషన్‌..! భారత్ గగన్‌యాన్‌పై దృష్టి..

|

Oct 08, 2023 | 2:02 PM

ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఎన్నో రకాల మిషన్లు చేపట్టబోతున్నామని.. స్పేస్‌ స్టేషన్‌, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవ సహిత స్పేస్‌ఫ్లైట్‌ ఆ జాబితాలో ఉన్నాయన్నారు.

ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఎన్నో రకాల మిషన్లు చేపట్టబోతున్నామని.. స్పేస్‌ స్టేషన్‌, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవ సహిత స్పేస్‌ఫ్లైట్‌ ఆ జాబితాలో ఉన్నాయన్నారు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైన తర్వాత అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని సైన్స్‌తో ఎలాంటి ప్రయోగాలు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. స్పేస్‌ స్టేషన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందో పరిశీలిస్తున్నామని సోమ్‌నాథ్‌ అన్నారు. చంద్రయాన్‌ తర్వాత భారత్ గగన్‌యాన్‌పై దృష్టి సారించింది. వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని యోచిస్తోంది. ఇదే విషయంపై సోమ్‌నాథ్‌ తాజాగా మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రణాళిక రచిస్తున్నామని అన్నారు. రోబోటిక్‌ ఆపరేషన్‌తో ఆ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం మానవ సహిత ఫ్లైట్‌ సామర్థ్యం భారత్‌కు లేనందున ఆ పనిపై దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. గగన్‌యాన్‌తో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. అది సాధ్యమైతే రాబోయే 20-25 ఏళ్లలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం జరుగుతుందని అన్నారు. మానవ సహిత అన్వేషణ, స్పేస్‌ఫ్లైట్ రూపకల్పన కూడా ఇస్రో అజెండాలో ఉందని చెప్పారు. అది సాధ్యమైతే ఇస్రో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ నిలుస్తుందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..