Infinix Zero Ultra 5G: దేశంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ ఇదే.! ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!

|

Dec 31, 2022 | 8:59 AM

5జీ కనెక్టెవిటీతో వస్తున్న ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా ఆండ్రాయిడ్‌ 12 XOSతో నిర్మితమవుతోంది. 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోల్డ్‌ డిస్‌ప్లేతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. అలాగే


ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్‌కి దాసోహం అయిపోయింది. మొబైల్‌ ఫోన్‌ లేనిదే క్షణం గడవని పరిస్థితి నెలకొంది. ఈక్రంమలో వివిధ కంపెనీలు రోజుకో కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రకరకాల అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌తో అందరికనీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా 5జీ. పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే చాలా వేరియంట్లను 5జీలో లాంచ్‌ చేశాయి. ఇదే కోవలో ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా 5జీ నెట్‌వర్క్‌తో దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. 8 జీబీ/256 జీబీ కాన్ఫిగరేషన్‌తో.. కాస్‌లైట్‌ సిల్వర్‌, జెనిసిస్‌ నోయర్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 25 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభమయ్యే ఈ ఫోన్‌ ప్రారంభ ధర 29,999 రూపాయలుగా ఉంది.5జీ కనెక్టెవిటీతో వస్తున్న ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా ఆండ్రాయిడ్‌ 12 XOSతో నిర్మితమవుతోంది. 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోల్డ్‌ డిస్‌ప్లేతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. అలాగే 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌, మరో 2 ఎంపీ డెప్త్‌ కెమెరా వస్తోంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500mAh బ్యాటరీతో 180వాట్ల సామర్థ్యంతో ఇండియాలో ఫాస్టెస్ట్‌ చార్జింగ్‌ ఫోన్‌గా ఇది నిలిచిపోనుంది. కేవలం 12 నిమిషాల్లోనే ఇది 100 శాతం చార్జింగ్‌ పూర్తవుతుంది. అలాగే ఇన్‌ఫినిక్స్‌ జీరో 20 పేరుతో మరో మోడల్‌ను కూడా తీసుకురానుంది. 4జీ కనెక్టెవిటీతో వచ్చే ఈ మోబైల్‌ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. ఇది డిసెంబర్‌ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. దీని ధర 15, 999 రూపాయలుగా ఉంది. దీనిలో ఫింగర్‌ ప్రింట్‌సెన్సార్‌ లేదు. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌, 2 ఎంపీ డెప్త్‌ కెమెరాలు, 60 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Dec 31, 2022 08:59 AM