చందమామ మట్టిని తెచ్చేందుకు.. ముహూర్తం ఫిక్స్ !! అదే జరిగితే..
ఇస్రో కీలక ప్రకటన చేసింది. 2028లో చంద్రయాన్-4 ద్వారా చంద్రుని మట్టి నమూనాలను భూమికి తీసుకురానుంది. 2035 నాటికి భారత అంతరిక్ష స్టేషన్ సిద్ధం కానుంది. గగన్‌యాన్ 2027కు వాయిదా పడింది. ఈ ఏడాది ఏడు ప్రయోగాలు చేపడుతున్నారు, ఇందులో ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కూడా ఉంది. భారత్ అంతరిక్ష రంగంలో కొత్త మైలురాళ్లను చేరుకోనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది. చందమామ మీది మట్టిని తీసుకొచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అందుకోసం చంద్రయాన్ 4 ప్రయోగానికి సిద్దమైంది. 2028లో చంద్రయాన్-4ను అంతరిక్షంలోకి పంపేందుకు అంతా రెడీ అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుని మీది నుంచి మట్టి నమూనాలను భూమికి తీసుకురానున్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలాంటి మిషన్‌లను విజయవంతంగా పూర్తిచేశాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరబోతోంది.చంద్రయాన్-4ను లునార్ సాంపిల్ రిటర్న్ మిషన్‌గా రూపొందిస్తున్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం అత్యంత క్లిష్టమైన పని. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మిషన్‌ను ఇస్రో చరిత్రలో అత్యంత సవాల్‌గా నిలవనుంది. అంతే కాకుండా ఇస్రో అంతరిక్షంలో ఇండియన్ స్పేస్ స్టేషన్ నిర్మించ తలపెట్టింది. మొత్తం ఐదు మాడ్యూళ్లలో తొలి యూనిట్‌ను 2028లో భూమి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు నారాయణన్ తెలిపారు. 2035 నాటికి మొత్తం స్టేషన్ సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా అమెరికా, చైనా తర్వాత స్వంత స్పేస్ స్టేషన్ ఉన్న మూడో దేశంగా భారత్ నిలవనుంది. మనుషులను అంతరిక్షానికి పంపే తొలి భారత మిషన్ అయిన గగన్ యాన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా నారాయణన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా 2025లో ప్రయోగం చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు 2027కు మార్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏడు ప్రయోగాలు ప్లాన్ చేశారు. అందులో ప్రైవేట్ ఇండస్ట్రీ తయారు చేసిన తొలి PSLV రాకెట్ సహా వాణిజ్య ఉపగ్రహాలు, మరికొన్ని PSLV, GSLV ప్రయోగాలు కూడా ఉంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వాచ్‌లో రూపాయి కాయిన్..! దాని ప్రత్యేకతలు ఇవే
ఆధార్ కార్డుల అప్డేట్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్
మరో మోడల్ చుట్టూ హర్థిక్ చక్కర్లు.. అదేనంటున్న నెటిజన్లు
Nayanthara: నయనతారకు .. విఘ్నేశ్ అదిరిపోయే గిఫ్ట్..
కసిగా లవర్ దగ్గరకు వెళ్ళాడు.. ప్రేమగా కొరికి చేతిలో పెట్టింది..
