త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర
మొబైల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. భారత్‌లో అతి త్వరలోనే 6G టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ఈ ఘనత సాధించబోతున్నట్లు ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ పరిశోధకుడు, ప్రొఫెసర్ కిరణ్ కూచి తెలిపారు. . 2030 నాటికి 6G రోలౌట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలకు చిరునామాగా నిలిచే ఐఐటీ హైదరాబాద్.. రాబోయే 6G టెక్నాలజీలో భారత్‌ను ఒక వినియోగదారుగా కాకుండా, ఒక కీలక శక్తిగా నిలపెట్టేందుకు కృషి చేస్తోందన్నారు.
6G అంటే కేవలం వేగం మాత్రమే కాదు. ఏఐ ఆధారంగా పట్టణాలు, గ్రామాలు, ఇండోర్, ఔట్‌డోర్, భూమి, సముద్రం, ఆకాశం ఇలా అన్నిచోట్లా హై-స్పీడ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా 6Gని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 6G టెక్నాలజీలో ఐఐటీ హైదరాబాద్ ముందువరుసలో ఉంది. వివిధ ప్రభుత్వ సంస్థల, విభాగాల సహకారంతో, ఇప్పటికే 7 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 6G ప్రోటోటైప్‌లు, అడ్వాన్స్డ్ మాసివ్ మిమో యాంటెన్నా శ్రేణులు, లో ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్ కక్ష్యలకు అనుకూలంగా ఉండే శాటిలైట్ వ్యవస్థలను రూపొందింది. ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త తరం మొబైల్ టెక్నాలజీ వస్తుంది. 5G టెక్నాలజీ 2010-2020 మధ్య కాలంలో రూపొందగా, భారత్ 2022లో 5జీని అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీని విస్తరణ కొనసాగుతోంది. 6జీకి సంబంధించిన ప్రమాణాల రూపకల్పన 2021లో మొదలైందని, 2029 నాటికి ప్రపంచ ప్రమాణాలు, 2030 నాటికి విస్తరణ ప్రారంభం అవుతాయని ప్రొఫెసర్ కూచి తెలిపారు. 6G టెక్నాలజీ వల్ల పొలాల నుంచి పరిశ్రమల వరకు, పాఠశాలల నుంచి ఆసుపత్రుల వరకు, రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యల వరకు ఏఐ-ఆధారిత 6G అప్లికేషన్లు ప్రతి పౌరుడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని ప్రొఫెసర్ తెలిపారు. దీంతో భారత్ మరింత ఉత్పాదకతతో, సమానత్వంతో, సురక్షితంగా మారుతుందని చెప్పారు. ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే
TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్ నుంచి మైండ్ షేక్ డీల్
ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి సినిమాలు రీ-రిలీజ్.. అందరికీ టికెట్స్ ఫ్రీ..
RGVపై దహనం ఎఫెక్ట్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆమె..!
Deepika Padukone: కల్కి సీక్వెల్ నుంచి దీపిక అవుట్ మరి.. ఆ ఛాన్స్ ఎవరికో ??
