గుడ్‌న్యూస్‌..వందేభారత్‌ స్లీపర్‌ పరుగులు..వచ్చే నెల నుంచే వీడియో

Updated on: Nov 23, 2025 | 1:52 PM

ప్రయాణికులను త్వరగా గమ్యానికి చేర్చేందుకు, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సౌలభ్యం కల్పిస్తూ వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. దేశవ్యాప్తంగా వందేభారత్‌ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకూ చైర్‌ కార్‌, నార్మల్‌ సిట్టింగ్‌ మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రవేశ పెడుతున్నారు. త్వరలో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

2025 డిసెంబర్‌లో వందే భారత్ స్లీపర్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. మొదటి ప్రొటోటైప్ స్లీపర్ రైళ్లల్లో కొన్ని సమస్యలు గుర్తించగా.. వాటిల్లో మార్పులు చేస్తున్నారు. వీటిని సరిచేసిన తర్వాత మెరుగైన నాణ్యతతో స్లీపర్ రైళ్లు రాబోతున్నట్లు ఆయన చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, అత్యంత ప్రమాణాలతో కూడిన ప్రయాణం అందించేందుకు ఎలాంటి పొరపాట్లు లేకుండా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు.కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 11 ఏసీ 3 టైర్, 4 ఏసీ 2 టైర్, ఒకటి ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్, విజువల్ డిస్‌ప్లే, కెమెరాలు, మాడ్యులర్ కిచెన్, నైట్ లైటింగ్ వంటి అత్యాధునిక కెమెరాలతో స్లీపర్ రైళ్లు త్వరలో పరుగులు తీయనున్నాయి. ఇక బయో వాక్యూమ్ టాయిలెట్లు, బేబీ కేర్, హాట్ వాటర్ షవర్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. ఇక రీడింగ్ లైట్స్, పవర్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోరింగ్ సిస్టం, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్, ప్రతీ కోచ్‌లో సీసీటీవీ కెమెరా, రిజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉండనున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో