మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
చంద్రుడిపై ఉన్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దక్షిణ కొరియా లునార్ ఆర్బిటర్ దనూరి కంటపడింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న దనూరి.. చంద్రయాన్-3 ల్యాండింగ్ పాయింట్ శివశక్తి, విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసి పంపింది. ఇది చంద్రుడి ఉపరితలంపై నుంచి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలు తీసినట్టు కొరియా ఏరోస్పేస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఆగస్టు 28న తీసిన ఈ ఫోటోలను దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
చంద్రుడిపై ఉన్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దక్షిణ కొరియా లునార్ ఆర్బిటర్ దనూరి కంటపడింది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న దనూరి.. చంద్రయాన్-3 ల్యాండింగ్ పాయింట్ శివశక్తి, విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసి పంపింది. ఇది చంద్రుడి ఉపరితలంపై నుంచి సుమారు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఫొటోలు తీసినట్టు కొరియా ఏరోస్పేస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఆగస్టు 28న తీసిన ఈ ఫోటోలను దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ల్యాండింగ్ సైట్ శివశక్తి పాయింట్ దక్షిణ ధ్రువం నుంచి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రుడిపై పరిశోధనల కోసం చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను ఆగస్టు 23న దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేసింది. ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. ఉపరితలంపై 100 మీటర్లకు పైగా ప్రయాణించి.. చంద్రుడి గురించి కీలక సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా ఉపరితలం, వాతావారణం పరిస్థితులపై అధ్యయనం కోసం ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాస్..నీ టైమ్ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్ అంతలోనే !!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది
గుడ్‌న్యూస్.. మరో 75 లక్షలమందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ !!