ఏఐ టెక్నాలజీపై ఫోకస్ ఇండియా ప్లాన్ ఇదే.. వీడియో

Updated on: Feb 06, 2025 | 2:07 PM

ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వైపే చూస్తోంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఏఐ..భవిష్యత్తులో టెక్నాలజీని పూర్తిస్థాయిలో శాసిస్తుందని.. ఫ్యూచర్ అంతా ఏఐదే అని చాలామంది భావిస్తున్నారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని భవిష్యత్తులో ఏఐ శాసించనుంది. ప్రస్తుతం జీడీపీలో దాదాపు 7.5శాతం ఈ ఒక్క రంగం నుంచే లభిస్తోంది.

2025 నాటికి ఇది 10శాతానికి చేరొచ్చన్నది నిపుణుల అంచనా. దీనికితోడు ఎడ్యూటెక్‌ రంగంలో 2030నాటికి ఏఐ మార్కెట్‌ విలువ 80 బిలియన్‌ డాలర్లుంటుందని పలువురు లెక్కలు వేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే భారత్‌ ఏఐ హబ్‌ కావడానికి అవసరమైన ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా 500 కోట్ల రూపాయిలతో ఏఐ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. భారత్‌ కూడా ఏఐ రీసెర్చి,ఇతర అప్లికేషన్లలో ఆధిపత్యం ప్రదర్శించడం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గతంలో వ్యవసాయం, ఆరోగ్యం, సస్టైనబుల్‌ సిటీస్‌ రంగాల్లో ఇలాంటి కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించారు. కొత్తగా ప్రతిపాదించిన ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ విద్యాప్రయోజనాల కోసం వినియోగించనుంది.