చెప్పిన పనులు చేసే రోబో జస్ట్ రూ. 5 లక్షలే..

Updated on: Aug 18, 2025 | 7:16 PM

భలే మంచి చౌక బేరము.. రూ.5 లక్షలకే హ్యూమనాయిడ్‌ రోబో అంటోంది చైనా. రోబో అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్‌ రోబో అంటే ఇంకా ఖరీదు. కానీ అస్సలు కాదు అంటోంది చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్‌. రోబోల తయారీలో పేరున్న ఈ కంపెనీ ఆర్‌1 హ్యూమనాయిడ్‌ను తయారుచేసింది.

దీని ధర కేవలం 5,900 డాలర్లు అంటే 5 లక్షల రూపాయలు మాత్రమేనట. ఈ రోబో పూర్తి కస్టమైజబుల్‌.. అంటే కస్టమర్‌ కోరిన విధంగా మార్పులు చేసి తయారు చేసి ఇస్తారు. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేస్తుంది. ఒకసారి రీచార్జ్‌ చేస్తే రోబో గంటపాటు పనులు చేసిపెడుతుంది. ఆర్‌1 రోబో పరిగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్‌ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ. చైనాలో వందలాది రోబోటిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అమెరికా కంపెనీలతో పోటీపడుతూ ఆధునిక హ్యూమనాయిడ్ రోబోలను అభివృద్ధి చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్‌ల తయారీలో ఇంతవరకు అమెరికన్‌ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ వచ్చాయి. “ఆర్1” రోబో బరువు సుమారు 25 కిలోలు, ఎత్తు నాలుగు అడుగులు. క్లిష్టమైన పనులను చేసేందుకు “లార్జ్ మల్టీ మోడల్”తో దీన్ని అభివృద్ధి చేశారు. దీని లోపల నాలుగు మైక్రోఫోన్లను అమర్చారు. వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమోసా ఇండియాలో పుట్టిందా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి..!

అన్నం పెడితే చాలు వాంతులు చేసుకుంటున్న చిన్నారి.. వైద్యులు టెస్టులు చేయగా

రాత్రి 7 గంటలలోపు భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా

Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?

వణికించిన తుఫాను.. గంటకు 260 కి.మీ వేగంతో గాలులు