గూగుల్ బంపరాఫర్… ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ

Updated on: Jul 23, 2025 | 4:34 PM

ఇండియన్‌ విద్యార్ధులకు గూగుల్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. గూగుల్ అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. దాదాపు 19వేల500 రూపాయిల ధరకు లభించే ఈ AI Pro ప్లాన్ లో.. హోంవర్క్, రైటింగ్, వీడియో జనరేషన్‌ టూల్స్‌ ను భారతీయ విద్యార్ధులు ఉచితంగానే యాక్సెస్‌ చేసే ఛాన్సిచ్చింది.

జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరిట ఈ అవకాశాన్ని అందిస్తుంది. 18 ఏళ్లు అంతకు పై వయసు కలిగిన విద్యార్థులు ఏడాది పాటు Google AI Pro ప్లాన్‌ ఉచిత సబ్ స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఇందులో 2 టీబీ క్లౌడ్ స్టోరేజీ కూడా ఉచితంగా లభిస్తుంది. జెమినీ సేవలను ఉపయోగించుకోవడానికి విద్యార్థులు ముందుగా గూగుల్ ఆఫర్ పేజీ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదుకు సెప్టెంబరు 15, 2025వ తేదీని చివరి తేదీగా గూగుల్ నిర్ణయించింది. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత గూగుల్లో పవర్‌పుల్ ఏఐ మోడల్ అయిన జెమినీ 2.5 ప్రోను ఉపయోగించుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌లో చేరిన తర్వాత జెమిని 2.5 ప్రో, దాని వీడియో జనరేషన్ AI మోడల్ అయిన Veo 3 వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో Gmail, డాక్స్, ఇతర Google యాప్‌లలో 2TB క్లౌడ్ స్టోరేజ్, AI ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ ప్లాన్‌లో చదువుకోవడానికి, రైటింగ్‌ రీసెర్చ్‌ ఉద్యోగానికి కావల్సిన టూల్స్‌ ఉన్నాయి. పరీక్షలు, హోంవర్కులు, వ్యాసరచన, కోడింగ్‌, ముఖాముఖీలకు అన్‌లిమిటెడ్‌ అకడమిక్స్ పోర్ట్ ఉపయోగపడుతుంది. స్టడీస్ కోసం, భవిష్యత్ ప్రణాళికలకు ఎక్కువ మంది విద్యార్థులు ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలోనే గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో ఏఐ పాత్ర విపరీతంగా పెరుగుతున్నందున.. టెక్ కంపెనీలు కూడా ఇప్పటికే ఈ పరిణామంలో భాగమవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎంత మంది విద్యార్థులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చనే దానిపై ఇప్పటివరకు గూగుల్ ఎలాంటి పరిమితీ విధించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కట్టు తప్పిన కన్నకూతురు.. దారుణశిక్ష విధించిన తల్లిదండ్రులు

పొద్దున్నే ఆలయానికి వెళ్లి డోర్ తీసిన అర్చకుడికి షాక్‌.. ఏం జరిగిందంటే..?

అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు

నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ

స్కూల్లో మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న చిన్నారి.. అంతలోనే..!