Fake SMS: మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

|

Apr 27, 2024 | 9:06 AM

క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు, కేవైసీ అప్‌డేట్లు అంటూ తరచూ మన ఫోన్‌కు మెసేజ్ లు వస్తుంటాయి. రివార్డ్‌ పాయింట్లు క్లెయిం చేసుకోండి. ఈరోజే లాస్ట్‌. అంటూ వాటిలో కొన్ని లింక్‌లు కూడా ఉంటాయి. నిజంగా ఆ సంస్థే పంపించిందా అన్నట్లుగా ఆ సందేశాలు కనిపిస్తాయి. పొరపాటున అవి నిజమే అనుకుని నమ్మి ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కినట్లే. బ్యాంక్‌లు, ఫైనాన్స్‌ సంస్థలు.. ఇలా..

క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు, కేవైసీ అప్‌డేట్లు అంటూ తరచూ మన ఫోన్‌కు మెసేజ్ లు వస్తుంటాయి. రివార్డ్‌ పాయింట్లు క్లెయిం చేసుకోండి. ఈరోజే లాస్ట్‌. అంటూ వాటిలో కొన్ని లింక్‌లు కూడా ఉంటాయి. నిజంగా ఆ సంస్థే పంపించిందా అన్నట్లుగా ఆ సందేశాలు కనిపిస్తాయి. పొరపాటున అవి నిజమే అనుకుని నమ్మి ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కినట్లే. బ్యాంక్‌లు, ఫైనాన్స్‌ సంస్థలు.. ఇలా అనేక కంపెనీల హెడ్డర్లతో సైబర్‌ నేరగాళ్లు ఈతరహా మోసాలకు పాల్పడుతున్నారు. హెడ్డర్‌ గురించి అవగాహన లేనివారు సులువుగా వారి బారిన పడుతున్నారు.

దీంతో సైబర్‌ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ, సూచనలు జారీ చేసే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్‌ దోస్త్‌ (Cyber Dost) అప్రమత్తమైంది. ఇకపై మెసేజ్‌లు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకొనేందుకు ఓ టిప్‌ను తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా పంచుకుంది. మరి మీ మొబైల్‌కు వచ్చిన ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.