ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??
ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కి అడిక్షన్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం లేచేదీ మొబైల్ ఆపరేటింగ్‌తోనే.. నిద్రపోయేదీ ఫోన్ ఆపరేటింగ్‌తోనే. చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. ఇది మంచిది కాదని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా స్మార్ట్ ఫోన్‌ను వదల్లేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా.
ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కి అడిక్షన్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం లేచేదీ మొబైల్ ఆపరేటింగ్‌తోనే.. నిద్రపోయేదీ ఫోన్ ఆపరేటింగ్‌తోనే. చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారు. ఇది మంచిది కాదని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా స్మార్ట్ ఫోన్‌ను వదల్లేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్‌లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్.. ఐఫోన్ ఫింగర్ ని స్మార్ట్‌ఫోన్ పింకీ అని అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్నే ‘స్మార్ట్ ఫోన్ పింకీ’ లేదా ‘ఐఫోన్ ఫింగర్’ అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??