పొరపాటున గూగుల్‌లో ఈ విషయాలపై సెర్చ్ చేస్తే.. సీదా జైలుకే
ఇటర్నెట్ వాడకం విస్తృతం అయినప్పటి నుంచి మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఎలాంటి సమాచారమైనా ఒక్క క్లిక్‌తో క్షణాల్లో మన ముందు ఉంచుతుంది. తెలియని విషయం గురించి ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఏది పడితే అది సెర్చ్ చేస్తే మాత్రం జైలు తప్పదంటున్నారు పోలీసులు.
ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి సీదా ఇంటికొచ్చి మరీ పట్టుకెళతారు. గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు నాలుగు రకాల విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇంతకీ గూగుల్‌లో ఎలాంటివి సెర్చ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. నెంబర్ 1 బాంబు ఎలా తయారు చేయాలో వెతకొద్దు. బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతి గురించి మీరు Googleలో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. దేశంలోని నిఘా సంస్థలు ఇటువంటి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 2 హ్యాకింగ్ చేయడం ఎలా అని సెర్చ్ చేశారనుకోండి అంతే సంగతులు. గూగుల్‌లో డివైస్‌ని ఎలా హ్యాక్ చేయాలి, పాస్ వర్డ్‌ని ఎలా హ్యాక్ చేయాలి లేదా హ్యాకింగ్ టూల్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అని సెర్చ్ చేయకూడదు. సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఉన్న వ్యక్తుల దృష్టికి ఈ విషయం చేరితే, హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం. ఇక నెంబర్ 3 పైరేటెడ్ సినిమాలపై సెర్చింగ్. ప్రస్తుతం OTT లేదా థియేటర్‌లకు వెళ్లే బదులు, ప్రజలు Googleలో ఉచిత సినిమాల కోసం వెతుకుతున్నారు. ఇక్కడ సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను చూడొచ్చు. మీరు Googleలో పైరేటెడ్ సినిమాను డౌన్‌లోడ్ చేసుకుంటే లేదా సెర్చ్ చేస్తే, మీకు జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ నేరం కిందకు వస్తుంది. నెంబర్ 4 పిల్లల అశ్లీల ఫొటోలు, వీడియోల కోసం Google చేశారనుకోండి సీదా జైలుకే.ఇలా చేయడం ప్రపంచవ్యాప్తంగా నేరంగా పరిగణిస్తున్నారు. మీరు పిల్లల అశ్లీల కంటెంట్ కోసం సెర్చ్ చేస్తే.. మీపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. POCSO అంటే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద మీపై కేసు నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో సుదీర్ఘ జైలు శిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింతఘటన.. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందా..? వింతను చూసేందుకు ఎగబడ్డ జనం
నా భార్యను కాపాడండి.. వరదలో చిక్కుకున్న భర్త ఆవేదన
ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే.. ఆ విషయంలో హ్యాపీ..
Rana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన రానా..