అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..

Updated on: Jan 17, 2025 | 1:43 PM

ప్రపంచంలో భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే అది తమకే సాధ్యం అని మరోసారి నిరూపిస్తోంది డ్రాగన్‌ కంట్రీ చైనా. ప్రపంచంలోనే మరో అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి సిద్ధం అవుతోంది. అయితే అది భూమి మీద మాత్రం కాదట. ఏకంగా అంతరిక్షంలోనే ఓ భారీ ప్రాజెక్ట్‌కు ప్లాన్‌ వేసింది. సోలార్‌ పవర్‌ను సమర్థవంతంగా వినియోగించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

శాస్త్రవేత్తలు దీనిని త్రీగోర్జెస్‌ డ్యామ్‌ ఆఫ్ స్పేస్‌గా పిలుస్తున్నారు. త్రీగోర్జెస్‌ డ్యామ్ మానవులు సృష్టించిన అతిపెద్ద నీటి నిల్వ కేంద్రం. తాజాగా సోలార్‌ పవర్‌ను కూడా అదే స్థాయిలో ఒడిసిపట్టేలా చైనా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమికి 32వేల కిలోమీటర్ల ఎత్తులో కిలోమీటర్‌ వెడల్పుతో భారీ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. దాంతో రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరం సోలార్‌పవర్‌ను సేకరించడానికి వీలవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి.. భూమి లోపలి నుంచి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సమానంగా సైంటిస్టులు పేర్కొన్నారు. లాంగ్‌లెహావో ఈ భారీ ప్రాజెక్ట్‌ను త్రీగోర్జెస్‌ డ్యామ్‌తో పోల్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్భవతులను చేయండి.. లక్షలు సంపాదించండి..!