గుండె సమస్యలను క్షణాల్లో గుర్తించే ఏఐ టెక్నాలజీ

Updated on: Aug 09, 2025 | 7:15 PM

చిన్నవయసులోనే కార్డియాక్ అర్టెస్టులు.. హార్ట్‌ స్ట్రోక్‌లు ఇటీవల సర్వసాధారణం అయిపోయాయి. ఇటీవల చాలామంది యువకులు ముఖ్యంగా 30 ఏళ్లలోపే గుండెపోటుకు గురవుతున్నారు. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నా.. ముందే గుర్తించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆహారం ఊపిరితిత్తులకు చేరడం వల్ల రక్తనాళాల్లో అడ్డుపడి మృత్యువాత పడతారు.

చిన్న వ్యాయామాల సమయంలో.. పరిగెత్తినప్పుడు అలసటగా ఉంటే వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సడన్ స్ట్రోక్‌ వచ్చే వారిలో సగం మంది ఆస్పత్రికి చేరకుండానే మరణిస్తున్నారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ హృద్రోగ నిపుణులకు వరంగా మారుతుందని వైద్య నిపుణులు ఓశుభవార్త చెప్పారు. గుండె సమస్యలను పది క్షణాల్లోనే గుర్తించే ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మేధా ఏఐ, నారాయణ హెల్త్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ బృందాలు సంయుక్తంగా పరిశోధించి దీన్ని రూపొందించాయి. గుండె ఆరోగ్యంలో లోపాలు, ఆరోగ్యంపై సాధారణ ఈసీజీతోనే అత్యంత కచ్చితత్వంతో, అతి తక్కువ సమయంలో నివేదిక ఇచ్చేందుకు ఏఐ టెక్నాలీజీ ఉపయోగపడుతుందంటున్నారు. గుండె చికిత్సలకు, రోగ నిర్ధారణకు.. ఇది వినూత్న ఆవిష్కరణ అని వైద్య నిపుణులు తెలిపారు. దేశంలో ఏటా కోటిమంది కొత్తగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో 18లక్షల మంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏఐ టెక్నాలజీతో కూడిన వైద్య చికిత్స అందుబాటులోకి తీసుకొస్తే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు

పాదాలకు చెప్పులు, షూ లేకుండా వాకింగ్‌ చేయండి.. ఫలితాలు చూస్తే షాకవుతారు

అసలు వీరు పేరంట్సేనా..? కన్న కొడుకును ఎయిర్‌పోర్ట్‌లో వదిలి వెకేషన్‌కు..?

అరుదైన ‘మాస్క్డ్‌ బూబీ’ని ఎప్పుడైనా చూసారా?

హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్‌ కాల్‌కు 20 వేలు