Mobile Connections: 73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో..

|

Aug 10, 2024 | 6:50 PM

రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌ల‌మైన 73 ల‌క్షల మొబైల్ క‌నెక్షన్లను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ టెల్కోల‌ను ఆదేశించింది. వివ‌రాల ధ్రువీక‌ర‌ణలో విఫ‌ల‌మైన కంపెనీలు, కనెక్షన్లను ర‌ద్దు చేశాయి. న‌కిలీ ఐడీలు, నకిలీ అడ్రస్‌ల‌తో త‌ప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు..

రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌ల‌మైన 73 ల‌క్షల మొబైల్ క‌నెక్షన్లను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్షన్లను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ టెల్కోల‌ను ఆదేశించింది. వివ‌రాల ధ్రువీక‌ర‌ణలో విఫ‌ల‌మైన కంపెనీలు, కనెక్షన్లను ర‌ద్దు చేశాయి. న‌కిలీ ఐడీలు, నకిలీ అడ్రస్‌ల‌తో త‌ప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవ‌స్థని రూపొందించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్లడించింది.

ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్‌లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల రీవెరిఫికేషన్‌లో విఫలం కావ‌డంతో డిస్‌కనెక్ట్ చేసినట్టు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియ‌జేశారు. అలాగే నకిలీ రుజువుల‌తో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. పాన్-ఇండియా ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిగి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి, దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న1.92 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డాట్‌ గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్‌లను నిర్ణీత పరిమితిలోపు తీసుకొచ్చామని మంత్రి చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.