శ్రీశైలం డ్యామ్‎ను పరిశీలించిన కేఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం..

Edited By:

Updated on: May 01, 2024 | 5:52 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయన్ని కెఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు చెందిన నాలుగురు సభ్యలతో కూడిన బృందం సందర్శించింది. జలాశయం వద్ద పరిశీలనకు వచ్చిన ఈ బృందానికి డ్యామ్ అధికారులు స్వాగతం పలికారు. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం పరిశీంచింది. నేడు రెండోవ సారి డ్యాం భద్రత, నీటి నిల్వలు, గేట్ల రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)ను పరిశీలించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయన్ని కెఆర్ఎంబి, ప్రపంచ బ్యాంకు చెందిన నాలుగురు సభ్యలతో కూడిన బృందం సందర్శించింది. జలాశయం వద్ద పరిశీలనకు వచ్చిన ఈ బృందానికి డ్యామ్ అధికారులు స్వాగతం పలికారు. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం పరిశీంచింది. నేడు రెండోవ సారి డ్యాం భద్రత, నీటి నిల్వలు, గేట్ల రోప్స్ పని తీరు అలానే జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)ను పరిశీలించారు. డ్యామ్ మరమ్మతులకు అవసరమైన బడ్జెట్‎ను పూర్తిగా పరిశీలించి ప్రపంచ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. నివేదిక అనంతరం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన పెద్ద గొయ్యి(ప్లాంజ్ ఫుల్)కు అలానే గ్యాలరీ రోడ్డు నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో పరిశీలించిన జలాశయం వివరాలను అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం డ్యామ్ వ్యూ పాయింట్ వద్దకు చేరకుంది పరిశీలనకు వచ్చిన బృందం. శ్రీశైలం డ్యామ్ అధికారులతో నిర్వహణకు అవసరమయ్యే నిధుల ప్రణాళిక తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..