గిగా వర్కర్ల దశ మారబోతుంది.. చిన్న మార్పుతో భవిష్యత్తుకు బాటలు వేసుకోండిః ప్రొఫెసర్ అమితాబ్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా ఏస్ ప్రో అడుగు పెట్టబోతోంది. టాటా మోటార్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత టాటా ఏస్ ప్రోతో కొత్త ఆరంభం చేసింది. దేశంలో ఇదే మొదటి ప్రో ట్రక్, దీని ప్రారంభ ధర ₹ 3.99 లక్షలు మాత్రమే. ఇది కొత్త, చిన్న వ్యాపారవేత్తల కోసం రూపొందించినది. మూడు ఇంధన వేరియంట్లలో లభిస్తుంది. ఢిల్లీ JNU ప్రొఫెసర్ అమితాబ్ కుండు టాటా ఏస్ ప్రోపై సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా ఏస్ ప్రో అడుగు పెట్టబోతోంది. టాటా మోటార్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత టాటా ఏస్ ప్రోతో కొత్త ఆరంభం చేసింది. దేశంలో ఇదే మొదటి ప్రో ట్రక్, దీని ప్రారంభ ధర ₹ 3.99 లక్షలు మాత్రమే. ఇది కొత్త, చిన్న వ్యాపారవేత్తల కోసం రూపొందించినది. మూడు ఇంధన వేరియంట్లలో లభిస్తుంది. ఢిల్లీ JNU ప్రొఫెసర్ అమితాబ్ కుండు టాటా ఏస్ ప్రోపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘‘ఇప్పుడు నా వంతు, ఇది చాలా మంచి ప్రచారం. ఇది ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుతుంది, ప్రజలు ఉపాధిని సృష్టించడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎక్కువ ఉపాధి సృష్టించబడితే, పేదరికం తగ్గుతుంది’’ అని ఆయన అన్నారు. దీంతో పాటు, టాటా ఏస్ ప్రోకు సంబంధించిన అనేక ఇతర ప్రయోజనాలను ఆయన వివరించారు.
కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి, చిన్న వ్యాపారులకు టాటా ఏస్ ప్రో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ అమితాబ్ కుండు అన్నారు. ఇది గుర్తింపు, గౌరవంతోపాటు వారి ఆశయాలను నేరవేరుస్తుందన్నారు. భారతదేశ యువత, మహిళలు నమ్మకంగా వ్యవస్థాపకతలోకి అడుగు పెట్టడానికి ఎలా వీలు కల్పిస్తుందో ప్రొఫెసర్ అమితాబ్ కుండు స్పష్టం చేశారు. కార్మికుడి నుండి యజమానిగా మారడం ఒక పరివర్తనాత్మక ముందడుగు అన్నారు. ముఖ్యంగా గిగా వర్కర్ల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడ్డారు.
చాలా మంది యువ భారతీయులు, మహిళలకు, వాహన యాజమాన్యులు కావాలని ఉంటుంది. అటువంటి వారికి ఇదో మంచి అవకాశమన్నారు. అంతేకాదు టాటా ఏస్ ఫ్రో ఆదాయాన్ని మాత్రమే కాకుండా గౌరవం, స్వాతంత్ర్యం, భవిష్యత్తు ప్రణాళికను కూడా తెచ్చిపెడుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణాలతోపాటు భారతదేశం అంతటా, మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు సరఫరా గొలుసులను నడుపుతుండగా, యువత టాటా ఏస్ ప్రో వంటి వాహనాల ద్వారా సూక్ష్మ వ్యాపారాలను నిర్మిస్తున్నారు. చిన్న మార్పుతో వ్యక్తిగతంతోపాటు ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చన్నారు. టాటా ఏస్ ప్రో తదుపరి తరం వ్యవస్థాపకులకు సాధికారత కల్పిస్తుందని ప్రొఫెసర్ అమితాబ్ కుండు అన్నారు, యాజమాన్యం కేవలం వాహనాన్ని కలిగి ఉండటమే కాదు, భవిష్యత్తును కలిగి ఉండటం అని స్పష్టం చేశారు.
భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు అయిన టాటా మోటార్స్, సరికొత్త టాటా ఏస్ ప్రోను ప్రారంభించింది. కార్గో మొబిలిటీలో కొత్త మైలురాయిని సృష్టిస్తూ, చిన్న కార్గో మొబిలిటీలో పరివర్తన యుగానికి నాంది పలికింది. కేవలం రూ. 3.99 లక్షల సాటిలేని ప్రారంభ ధరతో, టాటా ఏస్ ప్రో భారతదేశంలో అత్యంత సరసమైన నాలుగు చక్రాల మినీ ట్రక్, ఇది అసాధారణ సామర్థ్యం, సాటిలేని బహుముఖ ప్రజ్ఞ, ఉన్నతమైన విలువను అందిస్తుంది. ఇది ఆదాయాన్ని మాత్రమే కాకుండా గౌరవం, స్వాతంత్ర్యం, భవిష్యత్తు ప్రణాళికను కూడా తెస్తుంది.
కొత్తతరానికి సాధికారత కల్పించడానికి రూపొందించిన టాటా ఏస్ ప్రో పెట్రోల్, ద్వి-ఇంధనం (CNG + పెట్రోల్), ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది వినియోగదారులకు వారి వ్యాపార అవసరాలకు అనువైన పరిష్కారాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ 1250 వాణిజ్య వాహనాల అమ్మకాల టచ్‌పాయింట్లలో లేదా టాటా మోటార్స్ ఆన్‌లైన్ అమ్మకాల వేదిక అయిన ఫ్లీట్ వెర్స్‌లో కస్టమర్లు తమకు నచ్చిన ఏస్ ప్రో వేరియంట్‌ను బుక్ చేసుకోవచ్చు. టాటా ఏస్ ప్రో యాజమాన్యాన్ని సౌకర్యవంతంగా చేయడానికి, టాటా మోటార్స్ ప్రముఖ బ్యాంకులు, NBFCలతో కలిసి పనిచేస్తుంది. త్వరితగతిన రుణ ఆమోదాలు, సౌకర్యవంతమైన EMI తోపాటు విభిన్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అవాంతరాలు లేని ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..