ఇక్కడ ఇదే నా చివరి జన్మదినోత్సవం.! హైదారాబాద్‌కు మకాం మారుస్తున్న విశాఖ స్వరూపానందేంద్ర.

Updated on: Nov 19, 2023 | 8:42 AM

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను హైదరాబాద్ కు మకాం మార్చనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని కోకాపేటలో చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విశాఖలో ఇదే తన చివరి జన్మదినోత్సవమని, వచ్చే ఏడాది తన షష్టిపూర్తిని కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంఓ జరుపుకుంటానని వెల్లడించారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది తాను హైదరాబాద్ కు మకాం మార్చనున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని కోకాపేటలో చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విశాఖలో ఇదే తన చివరి జన్మదినోత్సవమని, వచ్చే ఏడాది తన షష్టిపూర్తిని కోకాపేటలోని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంఓ జరుపుకుంటానని వెల్లడించారు. విశాఖ శారదాపీఠం బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి చూసుకుంటారని తెలిపారు. శుక్రవారం విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక ప్రయటన చేశారు. తాను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తయిందని, తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోందన్న ఆయన, తాను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని తెలిపారు. విశాఖ పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది.. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తానని, విద్యాధికుడైన ఆయన ధర్మ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటారని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 19, 2023 08:27 AM