వేసవిలో పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా వీడియో

Updated on: May 13, 2025 | 8:12 AM

ఉల్లిపాయలు తిననివారు దాదాపు ఎవరు ఉండరు. ఉల్లి లేకుండా వంట చేయడం కూడా దాదాపు అసాధ్యం. ఇవి ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా ఇందులోని సహజ ఔషధ గుణాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది నిస్సందేహంగా పోషకాలకు పవర్ హౌస్ వంటిది. అందుకే దీన్ని పలు రకాల ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చు. వీటిని ఉడికించకుండా పచ్చిగా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి,సి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణుల ప్రకారం సాధారణంగా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అధిక వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వేసవిలో వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అటువంటి సమస్యల నుండి దూరంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. అలాంటి సందర్భాల్లో ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి రక్షించుకోవచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల శరీరాన్ని లోపల నుండి చల్లగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. అలాగే చెమటను కూడా తగ్గిస్తుంది. వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఉల్లిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో వచ్చే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

మరిన్ని వీడియోల కోసం :

80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో

బాంబులు పడతాయని భయం వేసింది వీడియో

ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో